స్టేజీ పై ఇంట్రెస్టింగ్ విషయాని లీక్ చేసిన బాలయ్య.. ఫ్యాన్స్ పూనకాలు గ్యారెంటీ..!!

బాలయ్య కెరియర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. కానీ చాలామందికి బాగా నచ్చేసిన సినిమా మాత్రం అఖండ అనే చెప్పాలి . బాలయ్య ఇన్నేళ్ల కెరియర్ లో ఫస్ట్ టైం అఘోర పాత్రలో కనిపించి మెప్పించారు.

ఈ సినిమాని బోయపాటి శ్రీను తనదైన దర్శకత్వం వహించి సినిమాకి మరో మెట్టు ఎక్కించారు . ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది అంటూ బోయపాటి ఎప్పుడో ప్రకటించారు . అయితే ఇప్పటివరకు దానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటనే రాలేదు.

 

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తవ్వగానే బాలయ్య కమిట్ అయిన బాబీ సినిమాను పూర్తి చేసుకొని .. ఆ తర్వాత బోయపాటితో అఖండ 2 ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు అన్న ప్రచారం జరుగుతూ వచ్చింది . అయితే రీసెంట్ గా అఖండ సినిమా కాస్ట్యూమ్ డిజైనర్ రామ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి . ఈ కాస్ట్యూమ్ డిజైనర్ ప్రస్తుతం హీరోగా ఫైటర్ అనే సినిమాలో నటించాడు . త్వరలోనే మన ముందుకు ఈ సినిమా రాబోతుంది . ఈ సినిమా టీజర్ ఈవెంట్ ఘనంగా జరిగింది . ఈ క్రమంలోనే అఖండ 2 గురించి ప్రస్తావించాడు రామ్ .

 

‘అఖండ సినిమాల్లో బాలకృష్ణ సార్ కి వేసిన కాస్ట్యూమ్‌స్ కి మంచి స్పందన వచ్చింది . అందుకు నేను చాలా చాలా హ్యాపీ.. నేను బోయపాటి గారు కలిసి ఆ డ్రెస్, చైన్స్ మొత్తం లుక్ రెడీ చేశాము.. అఖండ 2 సినిమా కోసం పని చేస్తున్నాను.. త్వరలోనే వర్క్ మొదలవుతుంది ..అఖండకు మించిన సినిమా అఖండ 2 ..ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది అంటూ క్రేజీ హింట్ ఇచ్చాడు ‘.

 

అంతే కాదు రీసెంట్ గా లెజెండ్ సినిమా రిలీజ్ అయ్యి 10 ఇయర్స్ అయిన శుభ సందర్భంగా ఆ సినిమాని రిలీజ్ చేస్తూ మార్చి 30న రిలీజ్ చేయడానికి ఫిక్స్ చేసాము అంటూ ఈవెంట్ కండక్ట్ చేశారు . ఆ ఈవెంట్ లో కూడా బాలయ్య స్టేజిపై మాట్లాడుతూ బోయపాటిని ఓ రేంజ్ లో పొగుడుతూ అఖండ2 పై క్రేజీ హింట్ ఇచ్చేశారు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది..!!

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్