బ్రిడ్జి ఏర్పాటు చేయాలని వినతి

కరీంనగర్/గన్నేరువరం, ఏప్రిల్ 20 (జాగో న్యూస్): గన్నేరువరం నుండి కరీంనగర్ కు మానేరు నదిపై బ్రిడ్జి ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు బ్రిడ్జి జేఏసీ అధ్యక్షుడు సంపతి ఉదయ్ కుమార్, కార్యదర్శి పుల్లెల రాములు శనివారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిడ్జి లేని కారణంగా సమయానికి 80 గ్రామాల ప్రజలకు విద్య వైద్యం అందని పరిస్థితి ఏర్పడినన్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే బెజ్జంకి, ఇల్లంతకుంట, గన్నేరువరం మండలాలకు చెందిన 80 గ్రామాల ప్రజలకు కరీంనగర్ దగ్గర అవుతుందన్నారు. మూడు మండలాల ప్రజల సౌకర్యార్థం కొరకు బ్రిడ్జి ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి ఎలక్షన్ కోడు ముగియగానే బ్రిడ్జి జేఏసీ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి బ్రిడ్జి నిర్మాణం కొరకు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్