కౌంటింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు.. * సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలి.. * జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, జూన్ 3 (జాగో న్యూస్): ఓట్ల లెక్కింపునకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వెల్లడించారు. సోమవారం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఎన్నికల సాధారణ పరిశీలకులు, ఐఏఎస్ అధికారి అమిత్ కటారియా, కౌంటింగ్ పరిశీలకురాలు జీ నజ్మాతో కలిసి పరిశీలించారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాలను పర్యవేక్షిం చారు. ఈ సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి అధికారుల ను వివరాలు అడిగి తెలుసు కున్నారు. పలు అంశాలపై సూచనలు సలహాలు అందజేశారు. సీసీ కెమెరాలు, బారికేడ్స్, పలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్ ప్రశాంతంగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. కౌంటింగ్ హాల్లోకి గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఇతరులను ఎవరిని అనుమతించవద్దని పేర్కొన్నారు కౌంటింగ్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఓట్లను లెక్కించాలని సూచించారు. స్ట్రాంగ్ రూమల్లో నుంచి కౌంటింగ్ హాల్లోకి ఈవీఎంలను జాగ్రత్తగా తరలించాలని పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కౌంటింగ్ సాఫీగా సాగేలా సిబ్బంది ప్రత్యేక కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్డీవోలు కే మహేశ్వర్, రమేష్ బాబు, రాజేశ్వర్, ఏసీపీ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్