బండి సంజయ్ తరఫున నామినేషన్ దాఖలు

కరీంనగర్, ఏప్రిల్ 19 (జాగో న్యూస్): కరీంనగర్ పార్లమెంటు బిజెపి అభ్యర్థి బండి సంజయ్ తరఫున బిజెపి నాయకుడు బండ రమణారెడ్డి శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతికి ఒక సెట్ నామినేషన్ పత్రాలను అందజేశారు. కలెక్టర్ ఛాంబర్ లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఆయన అందించారు. రమణారెడ్డి వెంట మాజీ ఎమ్మెల్యే బుడిగే శోభ, బిజెపి నాయకులు గంగాడి కృష్ణారెడ్డి, ప్రతాప రామకృష్ణ, డి శంకర్ పాల్గొన్నారు. పోలీస్ అధికారులు మూడంచెల భద్రత వ్యవస్థను కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. టౌన్ ఏసిపి నరేందర్ నేతృత్వంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మి కిరణ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, కరీంనగర్, హుజురాబాద్ ఆర్డీవోలు కే మహేశ్వర్, రమేష్ బాబు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్