కోతిరాంపూర్ లో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం * చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన జిల్లా కలెక్టర్

కరీంనగర్, జూలై 20 (జాగో న్యూస్): కరీంనగర్ లోని కోతి రాంపూర్ అన్నమనేని గార్డెన్ లో శనివారం స్త్రీ, మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మ మాట- అంగన్ వాడీ బాట కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ స్వయంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ అంగన్వాడీ కేంద్రాల బోధన పరికరాలను పరిశీలించారు. ఆట వస్తువులు, పుస్తకాలను పర్యవేక్షించారు. చిన్నారులకు గర్భిణీలకు అందించే పోషకాహారం ప్రదర్శనను తిలకించారు. కలెక్టర్ తో పాటు అసిస్టెంట్ కలెక్టర్ అజయ్ యాదవ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్