కరీంనగర్, మే 30 (జాగో న్యూస్): పొగాకుకు దూరంగా ఉండండి ఆరోగ్యాన్ని ,ఆర్థిక భద్రతను కాపాడుకోండి అని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. 31వ తారీకు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని తేదీ 30, శనివారము జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కరీంనగర్ కార్యాలయం ఆవరణంలో డి ఎం హెచ్ ఓ ఆధ్వర్యంలో వైద్య మరియు ఆరోగ్య సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. తదనంతరం ప్రపంచ వ్యతిరేక దినోత్సవ అవగాహన ర్యాలీని జెండా ఊపి జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా డి ఎం హెచ్ ఓ డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తిలైన సిగరెట్ , బీడీ ,తంబాకు ,గుట్కా, కైనీ, జర్ద తదితర ఉత్పత్తులను వినియోగించడం ద్వారా నోరు, గొంతు, ఊపిరితిత్తులు, ఆహార నాళం తదితర అవయవాలకు క్యాన్సర్ సోకుతుందని, గుండెపోటు, అధిక రక్తపోటు, పక్షవాతము, మధుమేహము తదితర అనారోగ్య సమస్యలకు గురవుతారు. చిన్న వయసులో సరదాగా మొదలవుతున్న అలవాటు క్రమంగా వ్యసనంగా మారుతుంది. యువత భవితను దహించి వేస్తుంది. దానివల్ల మానసిక శారీర ఆరోగ్య సమస్యలను వారిని చుట్టముడుతున్నాయి. కావున వైద్య సిబ్బంది ముఖ్యంగా పాఠశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేశారు. పొగాకు మరియు ఇతర ఉత్పత్తుల చట్టం 2003 ప్రకారం 18 సంవత్సరాల లోపు వారికి పొగాకు ఉత్పత్తుల అమ్మకూడదని, విద్యాసంస్థల 100 గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదని, బహిరంగ ప్రదేశాలైన బస్టాండు, వ్యాపార సముదాయాలు, సినిమా థియేటర్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో ధూమపానము చేయరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విప్లవ శ్రీ ఎన్సిడి ప్రోగ్రాం ఆఫీసర్, డాక్టర్ సుధా అడిషనల్ డి ఎం అండ్ హెచ్ ఓ,డాక్టర్ ఉమాశ్రీ పిఓడిటిటి, డాక్టర్ రవీందర్ రెడ్డి DTCO, డాక్టర్ సన,డాక్టర్ సాజిద డిఐఓ,శ్రీనివాస్ డెమో,రాజగోపాల్ ఏవో కైక హెల్త్ ఎడ్యుకేటర్, పోచయ్య NCD కోఆర్డినేటర్, స్వామి DPM, కార్యాలయ సిబ్బంది మరియు ఇతర వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.









