రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 03 (జాగో న్యూస్): రాజీ మార్గమే రాజ మార్గమని, కోర్టు కేసుల్లో ఇరుపక్షాలు రాజీ చేసుకోవడం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు పి.నీరజ అన్నారు. గురువారం జిల్లా కోర్టు సముదాయంలో సిరిసిల్ల మరియు వేములవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ కేసులు పరస్పర అంగీకారంతో పరిష్కారమవడం ద్వారా ప్రజలు దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియల నుంచి విముక్తి పొందుతారని తెలిపారు. NI యాక్ట్ (చెక్ బౌన్స్) కేసులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. బార్ అసోసియేషన్ సభ్యులు లోక్ అదాలత్లో మరిన్ని కేసులను పరిష్కారానికి పంపేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్, సీనియర్ సివిల్ జడ్జి, సిరిసిల్ల/ఇన్చార్జి కార్యదర్శి DLSA శ్రీ. పి.లక్ష్మణాచారి, సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ.ఆవునూరి రమాకాంతరావు, ప్రధాన కార్యదర్శి ch.వెంకయ్య, సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.







