రేకుర్తి బస్తీ దవాఖానను సందర్శించిన డిఎం అండ్ హెచ్ వో డాక్టర్ రాజగోపాలరావు

కరీంనగర్/రేకుర్తి, సెప్టెంబర్ 01 (జాగో న్యూస్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజగోపాల్ రావు  రేకుర్తి బస్తీ దవఖాన సందర్శించారు. ఈ సందర్శనలో హాజరు రిజిస్టర్, అవుట్ పేషెంట్ రిజిస్టరు, ఎన్ సి డి రిజిస్టర్, ఫార్మసీ స్టోర్స్ ,పిల్లల వ్యాధి నిరోధక టీకాలు నిల్వ ఉంచే ఐఎల్ఆర్ ను దాని రోజువారి టెంపరేచర్ రికార్డుల నమోదును పరిశీలించారు. స్టాఫ్ మరియు ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామపంచాయతీ లెవల్లో సర్పంచ్, వార్డు మెంబరు ,ఆశా కార్యకర్త, అంగన్వాడీ కార్యకర్త, ఏఎన్ఎం మరియు పంచాయతీ సెక్రెటరీ కలిసి ప్రతి వారము మీటింగ్ పెట్టుకుని ఫీవర్ సర్వే ,మెడికల్ క్యాంపు, ప్రతి శుక్రవారం డ్రై డే గా పాటించాలని చర్చించాలని సూచించారు, T-HUB కు ఫీవర్ శాంపిల్స్ను రెగ్యులర్గా పంపించాలి, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు ముందస్తుగా మెడికల్ క్యాంపు గురించి డేట్స్ మరియు స్థలo తెలియజేయాలి. పరిసరాల పరిశుభ్రత డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ మరియు వెక్టార్ బాండ్ వ్యాధులగురించి ప్రజలకు తెలియజేయాలి. పాము కాటు మరియు కుక్కకాటుకు సంబంధించిన మందులను నిల్వ ఉంచుకోవాలి, సిబ్బందికి సెలవులు అవసరమైనచో ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలి అని తెలియజేశారు, గర్భవతుల చెకప్స్ ,అభా కార్డుల క్రియేషన్ సంఖ్యను పెంచాలన్నారు 13 సం,,ల వయస్సు పైబడిన వారందరికీ ఆరోగ్య మహిళ హెల్త్ క్యాంపులలో స్క్రీనింగ్ చేసిన అందరిని రీస్క్రీనింగ్ చేస్తూ ఫాలోఅప్ చేయాలన్నారు. 14 సంవత్సరము నిండిన బాలికలకు HPV వ్యాక్సినేషన్ వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లావణ్య మరియు వైద్య ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్