ధర్మ రక్షణ పోరాటాన్ని కొనసాగించండి * శృంగేరి పీఠాధిపతిని దర్శించుకున్న బండి సంజయ్

కరీంనగర్, ఏప్రిల్ 15 (జాగో న్యూస్): బీజేజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు శృంగేరి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతి స్వామి వారిని దర్శించుకున్నారు. శృంగేరి పూర్వపీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్ధ మహాస్వామిజీ 74వ వర్ధంతి సందర్భంగా శృంగేరి విచ్చేసిన బండి సంజయ్ ప్రస్తుత పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ను ఆశీర్వదించిన శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామి వారు ధర్మ రక్షణ కోసం సంజయ్ చేస్తున్న పోరాటాలను అభినందించారు. ‘‘ధర్మాన్ని వీడొద్దు.. ధర్మరక్షణను కొనసాగించండి. ధర్మ పరిరక్షణ, గోసంరక్షణ కోసం సమాజాన్ని సంఘటితం చేయడంలో ముందుండి పోరాడండి’’అంటూ ఆశ్వీర్వదించారు. బండి సంజయ్ తోపాటు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కూడా శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్