ప్రశ్నించే సంఘము పై పగ సాధించడం డిఈఓ కి తగదు. * టిపిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మాడుగుల రాములు.

కరీంనగర్, ఏప్రిల్ 15 (జాగో న్యూస్): ఎస్.ఎస్ .సి స్పాట్ మూల్యాంకనం నందు సెల్ఫోను ఉపయోగిస్తున్నారని కేవలం టి పి టి ఎఫ్ సంఘ బాధ్యులైనటువంటి జిల్లా అధ్యక్షులు పోరెడ్డి దామోదర్ రెడ్డినీ, మరియు ప్రధాన కార్యదర్శి ఆర్. చంద్రశేఖర రావు ను సర్వీసు నుండి సస్పెండ్ చేయడం పగ సాధింపు చర్యే కానీ మరోటి కాదు. దీనిని టిపిటిఎఫ్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్. ఎస్. సి .ప్రశ్న పత్రాలను మూల్యాంకనం చేస్తున్న సాధారణ ఉపాధ్యాయుల వద్ద సెల్ ఫోన్ లభించినప్పుడు వారిని క్షమించి వదిలి పెట్టీ,సంఘనేతలను మాత్రమే సస్పెండ్ చేయడం అనేది విచారకరం. టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు అయిన పోరెడ్డి దామోదర్ రెడ్డి వద్ద సెల్ ఫోన్ లభించనప్పటికీ కారులో ఉన్న ఫోన్ ద్వారా 12వ తేది న, ఉదయం 11 గంటలకు దామోదర్ రెడ్డి ఫోన్ నుండి వాట్స్ అప్ మెసేజ్ గ్రూపులో తిరుగుతుంది అనే కారణంతో… ఏప్రిల్ 12వ తేదీ న మౌఖికంగా వివరణ అడిగి మూల్యాంకనమునకు అనుమతించిన జిల్లా విద్యాశాఖ అధికారి … మూల్యాంకనం ముగిసిన మరుసటి రోజు పరీక్ష పత్రాలను మూల్యాంకనం చేయించుకున్న తర్వాత సాయంత్రం 6 గంటలకు రిలీవింగ్ ఆర్డర్ ఇచ్చి, అదే రోజు రాత్రి 10 గంటలకు జడ్పిహెచ్ఎస్ పచ్చునూరు హెడ్మాస్టర్ ద్వారా ఏప్రిల్ 12వ తేదీతో సస్పెండ్ ఆర్డర్ను వాట్సప్ ద్వారా అందించడం విడ్డూరం. ఎక్కడైనా, ఎప్పుడైనా కానీ ఒక ఉద్యోగిని సస్పెండ్ చేసిన తర్వాత ఆ ఉద్యోగిని విధుల్లో నుండి రిలీవింగ్ చేసి ఇంటికి పంపిస్తారు కానీ ఇది ఎక్కడి విచిత్రమో… మూల్యాంకనం ముగిశాక పాత తేది లో సస్పెండ్ ఆర్డర్ ను ముద్రించి పంపడం మన జిల్లా విద్యాధికారి గారికే చెల్లింది. ఇలాంటి చౌకబారు సస్పెండ్లతో సంఘాలను, సంఘ నేతలను భయపెట్టలేరనే నిజాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి తెలుసుకుంటే మంచిది. వెంటనే ఈ అసంబద్ధ సస్పెండను రద్దు చేసి వెంటనే జాయినిగ్ ఆర్డర్ ను ఇవ్వాలని TPTF పక్షాన డిమాండ్ చేస్తున్నాం.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్