ఎన్నికల వ్యయ ఫిర్యాదులు, సలహాల కోసం పరిశీలకులను సంప్రదించండి.. * జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, ఏప్రిల్ 19 (జాగో న్యూస్): కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల వ్యయ ఫిర్యాదులు సూచనలు, సలహాల కోసం ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల వ్యయ పరిశీలకులను సంప్రదించవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు అశ్వినీ కుమార్ పాండే మొబైల్ నంబర్ 9032659531కు ఎన్నికల వ్యయానికి సంబంధించిన సంబంధిత అంశాలపై ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు పరిశీలకులు జిల్లాలోనే ఉండి ఎన్నికల వ్యయానికి సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తారని తెలిపారు. ఏదైనా ఫిర్యాదులు ఉంటే ఆయన దృష్టికి తీసుకు రావాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని ఎన్నికల వ్యయ పరిశీలకులు అశ్వినీ కుమార్ పాండే శుక్రవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై జిల్లా కలెక్టర్ తో చర్చించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్