భావ ప్రకటన స్వేచ్ఛ పై పాసిస్ట్ ముకాల దాడిని ఖండించండి * తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్

కరీంనగర్, ఏప్రిల్ 29 (జాగో న్యూస్): కాకతీయ యూనివర్సిటీ వరంగల్ సెనెట్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన లౌకిక విలువలు – సాహిత్యం అనే సదస్సు జరుగుతున్న సందర్బంగా ఫాసిస్టు మూకలు, ప్రముఖ కవులు డాక్టర్ పసునూరి రవీందర్, నరేష్ కుమార్ సూఫీ, మెర్సీ మార్గరెట్ మీద దాడి చేసి గాయపర్చడాన్ని, సదస్సును అడ్డుకోవడాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ తీవ్రంగా ఖండించారు. దేశంలో, రాష్ట్రములో లౌకిక ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలని, రాజ్యాంగ స్ఫూర్తితో సాహిత్య సదస్సు జరుగు తుంటే, ఫాసిస్టు మూకలు దాడికి పాల్పడటం భావ ప్రకటనా స్వేచ్ఛ మీద దాడి చేయడమే అని అన్నారు. ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఒకే భావజాలం కలిగిన వ్యక్తులు సమావేశాలు జరుపుకునే హక్కు ఉందని అలాంటి వాటిని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని అన్నారు.ప్రగతిశీల ప్రజాస్వామిక ఉద్యమాలకు కేంద్రమైన వరంగల్ గడ్డమీద కవులు, మేధావుల మీద దాడి ప్రజాస్వామ్యానికి పొంచి వున్న ప్రమాదాన్ని స్పష్టం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు, ప్తజాస్వామిక వాదులు ఇట్టి దాడిని, ముఖ్యంగా బావ ప్రకటన స్వేచ్ఛ పై దాడి గా భవిస్తూ, ఈ దాడిని యావత్ తెలంగాణ సమాజం, ప్రజా సంఘాలు ఖండించాలని సృజన్ కుమార్ పిలుపునిచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్