బ్రిడ్జి ఏర్పాటు చేయాలని వినతి

కరీంనగర్/గన్నేరువరం, ఏప్రిల్ 30 (జాగో న్యూస్): గన్నేరువరం నుండి కరీంనగర్ కు మానేరు నదిపై బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కరీంనగర్ మాజీ ఎంపీ బండి సంజయ్ కుమార్ కు బ్రిడ్జి జేఏసీ అధ్యక్షుడు సంపతి ఉదయ్ కుమార్, ఆధ్వర్యంలో మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిడ్జి లేని కారణంగా సమయానికి 80 గ్రామాల ప్రజలకు విద్య వైద్యం అందని పరిస్థితి ఏర్పడినన్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే బెజ్జంకి, ఇల్లంతకుంట, గన్నేరువరం మండలాలకు చెందిన 80 గ్రామాల ప్రజలకు కరీంనగర్ దగ్గర అవుతుందన్నారు. మూడు మండలాల ప్రజల సౌకర్యార్థం కొరకు బ్రిడ్జి ఏర్పాటు చేపడతామని గత పార్లమెంట్ ఎన్నికలు మాజీ ఎంపీ బండి సంజయ్ కుమార్ మండల కేంద్రంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు . దీనిపై బండి సంజయ్ సానుకూలంగా స్పందించి బ్రిడ్జి వేసి అన్నకు బి.ఆర్.ఎస్ ప్రభుత్వం అప్రూవల్ ఇవ్వలేదని అప్రూవల్ ఇస్తే బ్రిడ్జి నిర్మాణం చేపట్టే వాళ్ళమని బండి సంజయ్ తెలిపారని అన్నారు ఎలక్షన్ కోడు ముగియగానే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బ్రిడ్జి సాంక్షన్ చేస్తామన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో విడిచి జేఏసీ నాయకులు బ్రిడ్జి జేఏసీ చైర్మన్ సంపతి ఉదయ్ కుమార్, ఉపాధ్యక్షులు పుల్లెల జగన్ ,ప్రధాన కార్యదర్శి పుల్లెల రాము ,ప్రధాన కార్యదర్శి భామండ్ల రవీందర్ ,కార్యదర్శి గుండా వెంకటేష్ ఘర్షకుర్తి ప్రవీణ్ ,దొగ్గల వెంకటేష్ ,మాసం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్