వృద్ధాశ్రమము మరియు స్వాదార్ హోమ్ ను సందర్శించిన శిక్షణ న్యాయమూర్తులు

కరీంనగర్, మే 29 (జాగో న్యూస్): జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలో రెండు రోజుల శిక్షణలో భాగంగా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి వెంకటేష్  ఆధ్వర్యంలో 9 మంది శిక్షణ న్యాయమూర్తులు పట్టణంలోని ప్రభుత్వ వృద్ధాశ్రమము మరియు స్వాదార్ హోం ని సందర్శించారు. వృద్ధాశ్రమంలో అందుతున్న సేవలు గురించి తెలుసుకున్నారు. అలాగే స్వాదార్ హోమ్ లో ఉన్న బాధితులతో ముచ్చటించి వారి యొక్క సమస్యలను తెలుసుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్ మరియు వృద్ధాశ్రమము, స్వాధర్ హోం సిబ్బంది పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్