కౌంటింగ్ సిబ్బంది కేటాయింపు * జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, జూన్ 2 (జాగో న్యూస్): ఓట్ల లెక్కింపు కోసం పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ సిబ్బందిని కేటాయించారు. సెకండ్ రాండమైజేషన్ ప్రక్రియ కరీంనగర్ కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎన్నికల సాధారణ పరిశీలకులు ఐఏఎస్ అధికారి అమిత్ కటారియా, కౌంటింగ్ పరిశీలకురాలు జీ నజ్మా పర్యవేక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు ఓట్ల లెక్కింపుపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించామని పేర్కొన్నారు. కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగేలా ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మి కిరణ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్డిఓ కే మహేశ్వర్, మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్