మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి సేవలు మరువలేనివి.. * ముద్దసాని లాంటి నాయకుడు నేడు అరుదు.. పోలాడి రామారావు

శంకరపట్నం, జూలై 20 (జాగో న్యూస్): రాష్ట్ర మాజీ మంత్రి, స్వర్గీయ ముద్దసాని దామోదర్ రెడ్డి సేవలు మరువలేనివని సీనియర్ సిటిజన్, రైతు ప్రజా సంఘాల సంఘాల జాతీయ నాయకుడు పోలాడి రామారావు అన్నారు. శనివారం దామోదర్ రెడ్డి 68వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి నాయకుల తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు, ఆనాడు కమలాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి, రైతుల సమస్యల పరిష్కారానికి విశేష సేవలందించిన గొప్ప నాయకుడు దామోదర్ రెడ్డి అని అన్నారు. జిల్లా ప్రజలందరికీ అర్ధ రాత్రి వరకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించి, కార్య కర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆపదలో అండగా నిలిచిన కీ. శే. దామోదర్ రెడ్డి లాంటి నాయకులు నేడు చాలా అరుదని అన్నారు. స్వర్గీయ దామోదర్ రెడ్డి ని సామాన్య ప్రజలు, కార్య కర్తలు జిల్లా టైగర్ గా పిలుచుకునేవారని అన్నారు. రాష్ట్రంలోనే అప్పటి కమలాపూర్ , ఇప్పటి హుజురాబాద్ నియోజకవర్గానికి గుర్తింపు తెచ్చిన ఘనత దామోదర్ రెడ్డి కే దక్కుతుందన్నారు, 29 ఏళ్లకే ఎమ్మెల్యే గా 30ఏళ్లకే మంత్రి గా కరీంనగర్ జిల్లాలో 1985నుండి 2004వరకు వరుసగా 4సార్లు ఎమ్మెల్యే గా 3సార్లు మంత్రిగా ఎన్నికైన ముద్దసానిని బడుగు బలహీవర్గాల ఆశా జ్యోతి గా భూస్వాములు, పెత్తందార్ల పాలిట సింహ స్వప్నం గా, కమలాపూర్ కుర్రోడు అని అందరూ ముద్దుగా పిలిచే పేద, బడుగు బలహీనర్గాల నాయకులను తయారు చేసిన నాయకుడు స్వర్గీయ ముద్దసాని దామోదర్ రెడ్డి అని కొనియాడారు. దామోదర్ రెడ్డి లేని లోటు తీర్చలేనిదని, ఆయన ఆశయాలను నేటి యువత , ఆదర్శంగా తీసుకోవాలని పోలాడి రామారావు కోరారు. చంద్రబాబు మీద నాకు అన్న అభిమానం తో నా ప్రత్యేక విన్నపం మేరకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, నేటి విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని 2000సం. మే నెల 12వ తేదీన కరీంనగర్ జిల్లా, మానకొండూరు మండ లంలోని మా స్వగ్రామం వన్నారం గ్రామానికి దామోదర్ రెడ్డి రప్పించి కరీంనగర్ . వరంగల్ ప్రధాన హైవే గట్టుదుద్దెన పల్లి గ్రామం నుండి మా వన్నారం గ్రామం మీదుగా ఏరడపల్లి, అర్కండ్ల, గంగారం, ఎల్బాక, చల్లూర్ గ్రామం వరకు 14 కి. మీ. బీటీ రోడ్ నిర్మాణం పనిని చంద్రబాబు తో మంజూరి చేయించి దామోదర్ రెడ్డి పూర్తి చేయించారని , మానకొండూరు, శంకరపట్నం, వీణవంక మండలాల రైతులకు ఇట్టి రోడ్ నిర్మాణం తో ఎంతో మేలు చేకూరుతుందని రామారావు గుర్తు చేశారు. డాషింగ్, డేరింగ్, డైనమిక్, మాస్ లీడర్ గా స్వర్గీయ ముద్దసాని దామోదర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్