కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి నిరాశనే మిగిల్చింది. * జాతీయ పార్టీలకు పదహారు మంది ఎంపిలు ఉన్న ఒక్క రూపాయి కూడ తేలెకపోయారు. * గుంజపడుగు హరిప్రసాద్ 

కరీంనగర్, జులై 23 (జాగో న్యూస్): కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు నిర్మల సీతారమన్ 48,21,000 కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ ఉత్తరాది రాష్ట్రాలకు మరియు ఆంద్రప్రదేశ్ కు మాత్రమే పెద్దపీట వేశారు. కేంద్ర ప్రభుత్వం పదకొండవ సారి ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడంతో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఉందా లేద అనే అనుమానం ఇక్కడి ప్రజలకు కలుగుతుంది. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరచిన హామీలను అమలు చేసి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చెయ్యాలని అనేకసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం ఇక్కడి ప్రజలకు తెలియనిది కాదు. కనీసం ఈసారి అయిన బడ్జెట్ మన తెలంగాణ రావలసిన బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అదేవిధంగా పోలవరం కోసం ప్రత్యేక నిధులు పెట్టినట్లు తెలంగాణ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు ప్రత్యేక నిధుల కేటాయిస్తారు కావచ్చునని అలాగే ఆంద్రప్రదేశ్ కోసం విశాఖపట్నం- చెన్నై, ప్రకాశం జిల్లా నుండి బెంగుళూరు వరకు పారిశ్రామిక కారిడార్ల కోసం ఈబడ్జెట్ లో ప్రస్తావించినట్లు తెలంగాణకు కూడ ఎప్పటినుండో అడుగుతున్నా పారిశ్రామిక కారిడార్ల కోసం ప్రత్యేక నిధులు ఇస్తారు కావచ్చు అనీ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఎదురు చూసినారు కానీ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల మీద ఎం కక్ష్య ఉందో తెలియదు కానీ బిజెపి నాయకత్వంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలను ఈ బడ్జెట్ నిట్ట నిలువుగా ముంచింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడేబాయి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇద్దరు కలిసి ఇక్కడి ప్రజలకు గాలికి వదిలేశారు. ఇక్కడి నుండి పదహారు స్థానాలు గెలిచిన బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలు తెలంగాణ ప్రజల కోసం బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడ సాధించాలేక పోయారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కేవలం బిఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యం అవుతాయి అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ద్వారానే తెలుస్తుంది స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అన్న విషయం తెలంగాణ ప్రజలకు అర్దం అయ్యింది. గలాబీ సైనికులు ఎంపీ లుగా పార్లమెంట్‌లో ఉంటే కేంద్రం ప్రభుత్వానికి గట్టిగా ఇక్కడి ప్రజల గోంతుకగా తమ వాణిని భాణిని బలంగా వినిపించే వాళ్ళని బిఆర్ఎస్ పార్టీ జిల్లా మాజీ అధికార ప్రతినిధి, జిల్లా పార్టీ మీడియా సెల్ మాజీ ఇంచార్జ్ గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్