విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

నాగల్ గిద్ద, మార్చ్ 04 (జాగో న్యూస్): జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కారస్ గుత్తి పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి విద్యార్థులకు విద్యాబోధన చేసి మెప్పించారు. స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులుగా ఎంపిక కాబడిన పదవతరగతి విద్యార్థులు చక్కటి పాఠ్యాంశ బోధన చేసి ఆరు నుండి 10వ తరగతి విద్యార్థులకు బోధించి తమదైన ముద్ర వేసుకున్నారు. ఒక రోజు ఉపాధ్యాయులుగా అవకాశం ఇస్తే చక్కగా ఉపాధ్యాయులను అనుకరిస్తూ, అనుసరిస్తూ బోధించారు. అలాగే విద్యార్థులను క్రమశిక్షణలో ఉంచి వారి అనుభవాలను పంచుకున్నారు..ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో జిల్లా కలెక్టర్ గా యం.సంగీత, రీజినల్ జాయింట్ డైరెక్టర్ గా బి.పూజ, జిల్లా విద్యాశాఖాధికారిగా జె.శివకుమార్, మండల విద్యాశాఖ అధికారిగా జె.శివకుమార్ ప్రధానోపాధ్యాయులుగా యస్. కె.సామ్రీని, పిఈటి గా సోపాన్ , అనిల్ ఉపాధ్యాయులుగా సుశీల్,వర్ష,దీక్ష, ఆఫీస్ సబార్డినేట్ గా అవినాష్ , వికాస్, బాధ్యతలు నిర్వహించారు. అనంతరం చక్కటి బోధన చేసిన విద్యార్థి ఉపాధ్యాయులను ఎంపిక చేసి బహుమతులను ప్రధానం చేయడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు హీరమన్, ఉపాధ్యాయులు పుణ్యవతి,విజయ లక్ష్మి, మురళీ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్