గుజ్జులపల్లి శ్రీ రాజరాజేశ్వర గుళ్ళో మహా శివరాత్రి జాతరలో ఎన్ ఎస్ ఎస్ వలంటీర్ల సేవలు.

కరీంనగర్/సైదాపూర్, ఫిబ్రవరి 15 (జాగో న్యూస్): మండలంలోని గుజ్జులపల్లి శ్రీ రాజరాజేశ్వర గుళ్ళో మహా శివరాత్రి జాతరలో ఎన్ ఎస్ ఎస్ వలంటీర్ల సేవలు ప్రశంసనీయంగా అందించారు.గుజ్జులపల్లి గ్రామంలో మహా శివరాత్రి జాతర సందర్భంగా శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాల హుజురాబాద్ కి చెందిన ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు ప్రశంసనీయమైన సేవలు అందించారు. ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచడం రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా సహాయ సహకారాలు అందించడం వంటి కార్యక్రమాల్లో వాలంటీర్లు చురుగ్గా పాల్గొన్నారు. జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో వారిని క్రమబద్ధంగా దర్శనానికి పంపించడం పరిశుభ్రత పై అవగాహన కల్పించడం భక్తులకు అవసరమైన సూచనలు ఇవ్వడం వంటి సేవలను ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు నిర్విరామంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భక్తులు వాలంటీర్లు సేవలను అభినందించారు.సమాజ సేవ లక్ష్యంగా శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాల హుజురాబాద్ ఎన్ఎస్ఎస్ యూనిట్ భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి ప్రిన్సిపాల్ ప్రవీణ్ రెడ్డి ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మేకల నవీన్ కుమార్,గుజ్జులపల్లి సర్పంచ్ మాదం శ్రావణి శ్రీనివాస్ ,ఉప సర్పంచ్ వార్డు సభ్యులు,ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్