1989 నుండి 2026 పూర్వ విద్యార్థుల సమ్మేళనం

కరీంనగర్, ఫిబ్రవరి 21 (జాగో న్యూస్): సెంట్ ఆల్ఫోన్స్ ఫాదర్ టీ . సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో స్కూలు స్థాపించిన సంవత్సరం 1989 బ్యాచ్ నుండి 2026 బ్యాచ్ వరకు పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.. విద్యార్థుల సమ్మేళ కార్యక్రమంలో 1989 నుండి 2026 వరకు 37 సంవత్సరాల చదువుకున్న విద్యార్థులు పాల్గొని తమ స్కూల్లో గడిచిన పాత జ్ఞాపకాలను అందరితో పంచుకొని ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. అనంతరం 1993 – 1994 బ్యాచ్ కు చెందిన 71 మంది విద్యార్థులు 100% ఉత్తీర్ణిత సాధించి స్కూల్ పేరును స్టేట్ ఫస్ట్ ప్లేసులో సాధించామని గర్వంగా చెప్పారు. అనంతరం ఫాదర్ టి సంతోష్ కుమార్ పూర్వ విద్యార్థులకు మెమొంటోలు అందజేశారు. ఫాదర్ టి సంతోష్ కుమార్ ను బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ , డాక్టర్ రాజేంద్రప్రసాద్, పెద్ది మల్లికార్జున్, గుర్రం శ్రీధర్ , కృష్ణ ప్రసాద్ రాజు , పూర్ణచందర్ , ఈగ సంతోష్ , ఎస్ ఎస్ అరుణ్ కుమార్ , డాక్టర్ అనిల్ కుమార్ , సుమన్ తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్