అవగాహన సదస్సు

కరీంనగర్/గన్నేరువరం ,ఏప్రిల్ 8 (జాగో న్యూస్): గన్నేరువరం మండల కేంద్రం గన్నేరువరంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షులకు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయగా కమిటీ చైర్మన్ గా విలేజ్ ఆర్గనైజర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కన్వీనర్ గా, తరగతుల వారిగా విద్యార్థుల తల్లులను సభ్యులుగా తీసుకోవడం జరిగింది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడం కొరకు ఈ కమిటీలు కృషి చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో శంకరయ్య, ఎంపీ ఓ నరసింహారెడ్డి, ఏపీఎం లావణ్య, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్