పర్యాటకులను ఆకట్టుకునేలా ఉజ్వల పార్కును తీర్చిదిద్దండి.. * జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, ఏప్రిల్ 8 (జాగో న్యూస్): పర్యాటకులను ఆకట్టుకునేలా ఉజ్వల పార్కును తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పర్యాటక శాఖ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం సాయంత్రం కరీంనగర్ లోని ఉజ్వల పార్కును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పార్కులో కలియ తిరిగారు. ఉజ్వల పార్కు నిర్వహణ తీరు.. సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆహ్లాదం కోసం వచ్చే పర్యాటకుల కోసం పార్కును అందంగా తీర్చిదిద్దాలని సిబ్బందికి సూచించారు. పార్కు నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, అన్ని రకాల మొక్కలు, గార్డెన్ సంరక్షణకు కృషి చేయాలని పేర్కొన్నారు. నిర్లక్ష్యం చేయవద్దని, సెలవు రోజుల్లో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారని, ఈ మేరకు సిబ్బంది చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆదరణ పెరిగేలా కృషి చేయాలని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు మొక్కలు, ఫౌంటేన్ల వద్ద పిచ్చి మొక్కలు తొలగించాలని సూచించారు. వాటర్ షూట్ ను పరిశీలించారు. పార్కులో ఉన్న జగన్నాథ ఆలయాన్ని జిల్లా కలెక్టర్ దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, పర్యాటక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్