రాజీ మార్గమే రాజ మార్గం  *జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ 

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 03 (జాగో న్యూస్): రాజీ మార్గమే రాజ మార్గమని, కోర్టు కేసుల్లో ఇరుపక్షాలు రాజీ చేసుకోవడం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు పి.నీరజ అన్నారు. గురువారం జిల్లా కోర్టు సముదాయంలో సిరిసిల్ల మరియు వేములవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ కేసులు పరస్పర అంగీకారంతో పరిష్కారమవడం ద్వారా ప్రజలు దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియల నుంచి విముక్తి పొందుతారని తెలిపారు. NI యాక్ట్ (చెక్ బౌన్స్) కేసులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. బార్ అసోసియేషన్ సభ్యులు లోక్ అదాలత్‌లో మరిన్ని కేసులను పరిష్కారానికి పంపేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్, సీనియర్ సివిల్ జడ్జి, సిరిసిల్ల/ఇన్చార్జి కార్యదర్శి DLSA శ్రీ. పి.లక్ష్మణాచారి, సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ.ఆవునూరి రమాకాంతరావు, ప్రధాన కార్యదర్శి ch.వెంకయ్య, సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్