చెరువులు, రిజర్వాయర్ల సంరక్షణ, అభివృద్ధికి చర్యలు *అటవీ శాఖ, రెవెన్యూ, నీటి పారుదల, మత్స్య శాఖతో కలిసి కార్యాచరణ *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 03 (జాగో న్యూస్): జిల్లాలో గుర్తించిన చెరువులు (వెట్‌ల్యాండ్స్) సంరక్షణ, అభివృద్ధికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. చెరువులు (వెట్‌ల్యాండ్స్) సంరక్షణ, అభివృద్ధిపై అటవీ శాఖ, రెవెన్యూ, నీటి పారుదల, మత్స్య, వ్యవసాయ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సంబంధిత అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. చెరువులు(వెట్‌ల్యాండ్స్) నీరు నిల్వ ఉండే భూములు ప్రకృతి సమతుల్యతకు కీలకమని, ఇవి భూగర్భ జలాల పెరుగుదలకు, పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడతాయని తెలిపారు. జిల్లాలో మొత్తం 164 చెరువులు గుర్తించామని వెల్లడించారు. ఆయా చెరువుల హద్దులు, పూర్తి విస్తీర్ణం, ఎఫ్ టీ ఎల్ ను రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, అటవీ శాఖ, నీటి పారుదల ఇతర శాఖల సమన్వయంతో సర్వే, మ్యాపింగ్, ఆన్లైన్లో నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. వాటి అభివృద్ధి కోసం అటవీ శాఖకు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. ఆయా జల వనరుల అభివృద్ధి, మరమ్మత్తు పనులను అటవీ శాఖ ఆధ్వర్యంలో చేస్తారని పేర్కొన్నారు. దీంతో వలస, స్థానిక పక్షులు, జంతువులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే పర్యాటక రంగం అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తు లో చెరువులు కబ్జా నుంచి రక్షించవచ్చని స్పష్టం చేశారు. మొక్కల, చేపల పెంపకం, పర్యాటక అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.

*భూముల రీ సర్వేలో భాగస్వాములు కావాలి*

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వేలో ఆయా శాఖల అధికారులు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ ఆద్వర్యంలో జిల్లా సర్వే కొనసాగుతుందని తెలిపారు. అటవీ శాఖ, నీటి పారుదల శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు తమ శాఖలకు చెందిన భూముల వివరాలు సర్వే అధికారులకు ఇవ్వాలని, సర్వేలో పాల్గొనాలని ఆదేశించారు. దీంతో ఆయా శాఖల భూముల వివరాలు పక్కాగా నమోదు అవుతాయని వెల్లడించారు. వ్యవసాయ శాఖ అధికారులు ప్రస్తుతం సర్వే కొనసాగుతున్న గ్రామాల్లో రైతులు పాల్గొనేలా సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. సమావేశంలో ఆర్డీఓలు శ్రీధర్ బాబు, కే ఎస్ బీ కుమారి, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, నీటి పారుదల శాఖ అధికారి ప్రశాంత్ కుమార్ ఆయా శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సీనియర్ జర్నలిస్టు గూడూరి రమేష్ 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్