బీసీలకు న్యాయం చేయకపోతే ప్రజలే సమాధానం చెబుతారు *ఆర్ టి ఐ రాష్ట్ర అధ్యక్షులు దొగ్గలి శ్రీధర్ 

కరీంనగర్, సెప్టెంబర్ 03 (జాగో న్యూస్): సుస్మిత మాట్లాడిన మాటలకు మంత్రి కొండా సురేఖ గారిని బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసం? తప్పు ఎవరు చేశారో నిర్ధారించి వారిపై చర్యలు తీసుకోవాలి. కానీ తప్పు చేయని వ్యక్తిపై రాజకీయ బాధ్యత మోపి మంత్రి పదవి నుంచి తొలగించడం సరైన విధానం కాదు. కొండా సురేఖ గారి విషయంలో తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలి. ఆమె తీసుకునే న్యాయబద్ధమైన నిర్ణయాలకు మద్దతుగా నిలుస్తాం అని అన్నారు. క్రమశిక్షణ చర్యల్లో కులం, వర్గం, రాజకీయ పలుకుబడి ఆధారంగా ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదు. ఒక వర్గానికి ఒక న్యాయం, బీసీలకు మరో న్యాయం అన్న భావన కలిగితే అది ప్రభుత్వ విశ్వసనీయతకే నష్టం. బీసీ సంఘాలు, కుల సంఘాలు కూడా ఇలాంటి సందర్భాల్లో మౌనం వీడి బీసీల హక్కుల కోసం గట్టిగా ప్రశ్నించాలి అని కోరారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన 42% రిజర్వేషన్ల హామీ ఏమైంది? బీసీలకు కేవలం పదవులు ఇచ్చామని చెప్పడం కాదు—నిర్ణయాధికారం, కీలక శాఖల్లో సముచిత ప్రాతినిధ్యం, రాజకీయ మరియు ఆర్థిక సాధికారత కల్పించాలి. ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణను ప్రజల ముందుంచాలి. బీసీలు ఎవరికీ ఓటు బ్యాంకు కాదు. బీసీలకు కావాల్సింది మాటలు కాదు — వాటా, హక్కు, అధికారం! హామీలు ఇచ్చి విస్మరిస్తే ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తాం… ప్రజలే తగిన సమాధానం చెబుతారు అని అన్నారు..

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్