సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా కోడూరి పరశురాం గౌడ్ 

కరీంనగర్, ఏప్రిల్ 15 (జాగో న్యూస్): కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తారక హోటల్ లో నిర్వహించిన సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వ్యవస్థాపక అధ్యక్షులు వీరగోని పెంటయ్య ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడుతూ గత 12 సంవత్సరాల సంఘం ద్వారా జరిగిన పోరాట కార్యక్రమాలు సర్వాయి పాపన్న గుట్టల శ్రేణిని , గ్రానైట్ క్వారీల బారిన పడకుండా కాపాడిన పోరాటాలను తొలి వెలుగు ప్రజాస్వామిక విప్లవ వీరుడు సర్వాయి పాపన్న చరిత్రను ప్రజల్లోకి తీసుకు వెళ్లిన విధానంపై వేదిక సమర్పించారు. అనంతరం సభ్య సమావేశంలో కోడూరి పరుశురాం గౌడ్ ని సర్వాయి పాపన్న గీతా కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గీతా కార్మికుల ప్రమాదాల బారిన పడకుండా సేఫ్టీ మూకులను ప్రభుత్వం ద్వారా అందేలా చూస్తానని, ప్రమాదాలు జరిగినప్పుడు ఆస్పత్రి ఖర్చు లకు 50 వేల రూపాయల చొప్పున మరణించిన వ్యక్తులకు దహన సంస్కారాల కత్తి 25వేల రూపాయలు, సొసైటీ కి ఐదు ఎకరాల భూమితో పాటు సర్వాయి పాపన్న పేరు మీద భవనం నిర్మించడానికి ప్రభుత్వం ద్వారా మంజూరుకు కృషి చేస్తానని వారు తెలిపారు. అనంతరం సర్వాయి పాపన్న సభ్యులు శాలువాతో మరియు పూల బొకేతో అభినందించారు. ఈ సమావేశంలో సింగిం సత్తయ్య గౌడ్, కలర్ సత్తన్న గౌడ్, మల్లేశం గౌడ్, బుచ్చమన్నాగౌడ్, కర్బూజ తిరుపతి గౌడ్, రాజేశ్వర్ గౌడ్, సుధ గోని శ్రీనివాస్ గౌడ్, శేఖర్ గౌడ్, తాళ్లపల్లి లింగన్న గౌడ్ పలు గీతా సంఘం నాయకులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్