గన్నేరువరం మండల కేంద్రానికి బస్సు సౌకర్యం కల్పించాలి…

కరీంనగర్/గన్నేరువరం, ఏప్రిల్ 19 (జాగో న్యూస్): మండల కేంద్రం గన్నేరువరానికి వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని టిడిపి మండల అధ్యక్షుడు గుండా పరుశురాం డిమాండ్ చేశారు. శుక్రవారం గుండ్లపల్లి స్టేజి వద్ద మీడియాతో మాట్లాడుతూ మండల కేంద్రం ఏర్పాటు కాకముందు రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజి నుండి గన్నేరువరం కు సరిపడా బస్సులు నడిచేవి నేడు మండల కేంద్రం ఏర్పడినప్పటికీ ఒక్క బస్సు కూడా నడవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుండ్లపల్లి, గునుకుల కొండాపూర్, జంగపెళ్లి, గోపాలపూర్, హనుమాజు పల్లి, మాదాపూర్ గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి వెళ్లడానికి నానా పాట్లు పడుతున్నారని అన్నారు. మహిళా సంఘాల సభ్యులు, సిఏలు మండల కేంద్రంలో జరిగే ప్రత్యేక సమావేశాలకు వెళ్లడానికి ప్రత్యేకంగా ఆటో ఏర్పాటు చేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వ అధికారులు సొంత వాహనాలలో మండల కేంద్రంలోని కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకం ఈ రూట్లో బస్సు లేకపోవడంతో మహిళలకు అందని ద్రాక్ష గానే మిగిలిపోయింది. ఆర్టీసీ అధికారులు తక్షణం స్పందించి బస్సులు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్