మంత్రి పొన్నం కు కృతజ్ఞతలు తెలిపిన హైమద్ అలీ

కరీంనగర్, ఏప్రిల్ 20 (జాగో న్యూస్): ఇటీవల నగర కాంగ్రెస్ మైనారిటీ సెల్ చైర్మన్ గా నియమితులైన హైమద్ అలీ గారు నేడు నగర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్. ఏ. మొసీన్ తో కలిసి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ని వారి కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. తనకు కేటాయించిన ఈ పదవి పట్ల బాధ్యతగా వ్యవహరిస్తానని, ఈ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం మైనారిటీలను ప్రత్యేకంగా ఓటు అభ్యర్థించడంతో పాటు వారికి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను వివరిస్తానని పొన్నం ప్రభాకర్ కి హైమద్ అలీ తెలియజేశారు. మైనారిటీల సంక్షేమం పట్ల గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలపై విస్తృత ప్రచారం చేయాలని పొన్నం ఆదేశించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్