మేడే విజయవంతం చేయండి.

కరీంనగర్, ఏప్రిల్ 29 (జాగో న్యూస్): ముకుందలాలు మిశ్రా భవన్ లో కరీంనగర్ జిల్లా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం జరిగినది.ఈ సమావేశం ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ హాజరై మాట్లాడారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే పోరాట స్ఫూర్తి సందర్భంగా జిల్లాలోని ఆశా కార్యకర్తలు అందరూ మేడే వేడుకలు ఘనంగా నిర్వహించాలని కోరారు. ఈ మేడే సందర్భంగా వచ్చే పాలకులు పారితోషికాలు కాకుండా నిర్దిష్ట పనిగంటలు రూపొందించాలని, ఆశా కార్యకర్తలను కేంద్ర ప్రభుత్వo స్కీమ్ వర్కర్ల నుండి కార్మికులుగా గుర్తించాలని, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచన మేరకు ఫ్రంట్ లైన్ వర్కర్ కనీస వేతన అమలు చేయాలని, ఎనిమిది గంటల పని విధానం రద్దును విరమించుకోవాలని, నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26000 తదితర డిమాండ్స్ తో మండల కేంద్రాల్లో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఎదుట జెండా ఆవిష్కరణలు చేస్తాము. జెండా ఆవిష్కరణ అనంతరము ర్యాలీలు ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రంగవేని శారద,జిల్లా ప్రధాన కార్యదర్శి మారెల్ల శ్రీలత, జిల్లా ఉపాధ్యక్షులు నాగెల్లి పద్మ, శంకరమ్మ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటలక్ష్మి,పరిమిత, సత్య లక్ష్మి, శోభ,సరిత తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్