దళిత జాతికి వెంటనే క్షమాపణ చెప్పాలి 

కరీంనగర్/తిమ్మాపూర్, ఏప్రిల్ 30 (జాగో న్యూస్): ఇటీవలే తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన దళిత సమ్మేళనంలో దళితులను ఉద్దేశించి మాట్లాడుతూ కవ్వంపల్లి ప్రకాష్ అనే వ్యక్తి దళిత జాతిని ఉద్దేశించి అవమానకరమైన మాటలు మాట్లాడినందున అట్టి మాటలు వెనక్కి తీసుకొని వెంటనే దళిత జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పారునంది జలపతి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులు అంటే ఓట్లు అమ్ముకునే జాతిగా అభివర్ణించడం ఓ దళితుడిగా మీరు మాట్లాడడం శోచనీయమని అన్నారు. మీలాంటి మాటల వల్ల సమాజంలో మన జాతి యొక్క పరువు మంట కలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో దళితులు అంటరానితనం, అస్పృశ్యత అనేవి ఇప్పుడిప్పుడే దూరం అవుతున్న తరుణంలో మన జాతి పట్ల ఇంకా అదే రకంగా మాట్లాడు సిగ్గుచేటు అన్నారు అంతే కాకుండా దళిత జాతి పట్ల అవహేళనంగా మాట్లాడిన మాటలు వెంటనే వెనక్కి తీసుకొని దళిత జాతికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్