మానసా దేవి ఆలయంలో భక్తుల సందడి…

కరీంనగర్/గన్నేరువరం, మే 31 (జాగో న్యూస్): గన్నేరు వరం: శుక్రవారం రోజున మానస దేవి ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయంలో సందడి నెలకొంది. 108 జంట శివ నాగ లింగాలు, మానసా దేవి ఉత్సవ విగ్రహానికి భక్తులు అభిషేకాలు చేశారు. అర్చనలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోరిన కోర్కెలు తీరాలని అమ్మవారికి భక్తులు ముడుపులు కట్టగా, కొంతమంది భక్తులు అమ్మవార్లకు ఓడి బియ్యం సమర్పించారు. ముందస్తుగా ఆలయ కమిటీ చైర్మన్ ఎలేటి చంద్రారెడ్డి భక్తులకు సౌకర్యాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు , కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్