సివిల్స్ ర్యాంకర్ కి సిఎం సన్మానం..

కరీంనగర్/రామడుగు, జూన్ 3 (జాగోన్యూస్): కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన నందాల సాయి కిరణ్ ఇటీవలే విడుదల అయిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా 27వ ర్యాంకు సాధించారు. కాగా సాయికిరణ్ సోమవారం చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం తో కలసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాదులోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భగా సీఎం రేవంత్ రెడ్డి సాయికిరణ్ ను అభినందించి శాలువాతో సత్కరించారు. భవిష్యత్తులో మంచి స్థానం చేరుకొని ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని కోరారు. యువత సాయి కిరణ్ ను స్పూర్తి గా తీసుకొని జీవితం లో గొప్ప విజయాలు సాధించాలని సిఎం ఆకాంక్షించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్