గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వమే నేరుగా గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు ఇవ్వాలి

కరీంనగర్, మార్చి 04 (జాగో న్యూస్): గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వమే గ్రీన్ ఛానల్ ద్వారావేతనాలు నేరుగా చెల్లించాలని కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో సూపర్డెంట్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. అనంతరం విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో రెండు నుంచి మూడు నెలల పైన వేతనాలు బకాయి ఉన్నాయని వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల వేతనాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని, గత 2024 డిసెంబర్ నెలలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించి, నేరుగా ప్రభుత్వమే వారి అకౌంట్లో వేతనాలు చెల్లిస్తానని, ఒకటో తారీకు నుండి పదో తారీకు లోపు వేతనాలు చెల్లిస్తామని చెప్పి మూడు నెలలు గడుస్తున్నా, కూడా వేతణలు అందలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వేతనాలు అందించ క పోతే కార్మికులు మరో సమ్మె పోరాటానికి వెనుకాడరని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు రాచర్ల మల్లేశం, ఉపాధ్యక్షులు కాశిపాక శంకర్, కమిటీ సభ్యులు గంధసిరి సంపత్ , గరిగంటి రవి, రాచపల్లి రవి, లింగయ్య, సంపత్, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్