నల్లగొండ లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలి *మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపలి

కరీంనగర్/తిమ్మాపూర్, మార్చి 04 (జాగో న్యూస్): తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించాలని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన నల్లగొండ దేవస్థానాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ఆలయ పరిసర ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు వీలుగా చర్యలు చేపట్టాలన్నారు. భక్తుల కొంగుబంగారమైన శ్రీ సీతారామ లక్ష్మీ నృసింహస్వామి వారి జాతరకు కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాలను నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలి వస్తుంటారని, ఇక్కడికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ముఖ్యంగా రథోత్సవం, బండ్లు తిరిగే రోజు ఎలాంటి అపశృతులు దొర్లకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.

*వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

నల్లగొండ దేవస్థానంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. తిమ్మాపూర్ మండలం రామకష్ణ కాలనీకి చెందిన గొరిటాల సతీష్ వాటర్ ప్లాంట్ ను దేవస్థానానికి బహూకరించారని, భక్తుల దాహార్తిని తీర్చేందుకు వాటర్ ప్లాంట్ అందజేయడం మహత్కార్యమంటూ ధాత సతీష్ ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బండారు లక్ష్మణ్, తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మినారాయణ గౌడ్, పార్టీ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాస్ రావు, కొత్త తిరుపతిరెడ్డి, గండ్ర శ్రీనివాస్, దేవస్థానం డైరెక్టర్లు గాజుల అంజయ్య, బూత్కూరి శ్రీనివాస్, కందుకూరి లక్ష్మిరాజం, జినుక శ్రీనివాస్, మార్క మొండయ్య, రొడ్డ సాగర్, పూజారి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్