మృతుడి కుటుంబానికి బియ్యం వితరణ

రాజన్న సిరిసిల్ల/తంగళ్ళపల్లి, ఏప్రిల్ 02 (జాగో న్యూస్):
తంగళ్ళపల్లి మండలం, బస్వాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు చింతచెట్టు పై నుండి పడి మృతి చెందిన బంటు ఆనందం నిరుపేద కుటుంబానికి 50 కిలోల బియ్యం మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య వితరణ చేశారు. బస్వాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి పూర్మాని కనక లక్ష్మి లక్ష్మారెడ్డి 2వేల500 వందలు, శ్రీనివాస్ రెడ్డి 2వేల 500 చొప్పున నిరుపేద కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయగా, గ్రామాలలో అంతక్రియలు చేసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం కింద ₹20,000 అందించాలని ఈ సందర్భంగా అంతయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కర్నే బాలయ్య, మాజీ సర్పంచ్ గుడిసెల నీరజ, ఎల్లయ్య, తాటిపాముల శ్రీనివాస్, గొడిసెల తిరుపతి, దేవయ్య, సత్తు రామ్ రెడ్డి, చంద్రమౌళి, సురేష్, మల్లయ్య, బాబు, కనకయ్య, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్