సర్దార్ సర్వాయి పాపన్నకు ఘన నివాళి

కరీంనగర్, ఏప్రిల్ 02 (జాగో న్యూస్): సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమాన్ని కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సర్వాయి పాపన్న చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అణగారిన వర్గాలకు అభ్యున్నతి కోసం, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తి భవిష్యత్తు తరాలకు ఆదర్శమని అన్నారు. సామాజిక సమానత్వానికి పాటుపడిన మహనీయుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, గౌడ సంఘం ప్రతినిధులు, బిసి సంఘాల నాయకులు, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా అద్యక్షులు గౌడ సంఘం
గుగ్గిళ్ళ శ్రీనివాస్ గౌడ్,మాచెర్ల అంజయ్య గౌడ్, జక్కే వీరస్వామి, తాళ్ళపల్లి హరికుమార్ గౌడ్,సంపునూరి మల్లేశం గౌడ్, మునిగల సుధాకర్ గౌడ్,బుర్ర ముత్తయ్యా గౌడ్, పురుషోత్తం సుగుణకార్,ఆశిష్ గౌడ్,సాగర్ గౌడ్,అనిల్ గౌడ్ గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్