కేంద్రం నిధులతోనే సన్న బియ్యం పంపిణీ -బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి.

కరీంనగర్/తిమ్మాపూర్, ఏప్రిల్ 03 (జాగో న్యూస్): కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాప్ ల ద్వారా ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నదని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 80 కోట్ల మంది లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇస్తున్న విషయం తెలిసిందేనని అన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్న క్రమంలో గురువారం బీజేపీ కార్యకర్తలు రామక్రిష్ణకాలనీ లోని రేషన్ షాప్ వద్ద ప్రచారం చేసారు. ఈ సందర్బంగా జగదీశ్వరాచారి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ 5 ఏళ్ల పాటుగా ఉచితంగా బియ్యం ఇస్తున్న విషయం చేయకుండా, అవే నిధులతో సన్న బియ్యం కొనుగోలు చేసి ఇస్తున్నారని అన్నారు.కేంద్రం ఇస్తున్న బియ్యం విషయంలో రేషన్ షాప్ ల వద్ద ఉన్నటువంటి మిషన్ ద్వారా రసీదు లను ప్రజలకు చూపించి వివరించారు.పేద ప్రజలకు ఇస్తున్న ఉచిత బియ్యం పంపిణీ లో రాష్ట్ర వాటా ఎంత అనే విషయాన్ని కప్పి పెడుతున్నారని ఆరోపించారు.కేంద్రం ఇస్తున్నటువంటి ఉచిత బియ్యం పంపిణీ ని తామే ఇస్తున్నామని చెప్పుకోవడం, ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం నిస్సిగ్గుగా అనిపించడం లేదా అని ప్రశ్నించారు.సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మంచిదే అయినప్పటికీ గొప్పలకోసం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.5 ఏళ్ల పాటుగా కేంద్రం అందించే ఉచిత బియ్యం పంపిణీ ని ప్రజలు గమనించాలని తెలిపారు. ఎడ్ల భూంరెడ్డి, దుర్గుంటి శేఖర్, చింతలపల్లి రవీందర్ రెడ్డి, సిరికొండ వెంకట్రావు, మార్క కనకయ్య,రంగు భాస్కర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్