కార్పొరేటు కళాశాలలకు కొమ్ముకాస్తున్న ఇంటర్ బోర్డు.. *బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ 

కరీంనగర్, ఏప్రిల్ 30 (జాగో న్యూస్): ఇంటర్ బోర్డు అధికారులు కార్పొరేట్ కళాశాలలకు కొమ్ము కాస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ అన్నారు. ఇంటర్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న అడ్మిషన్లు చేపడుతున్న కార్పొరేట్ కళాశాలలో తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం ఇంటర్ బోర్డ్ కార్యాలయానికి లేఖ పంపినట్లు తెలిపారు. వేసవి సెలవుల్లో విద్యార్థులకు క్లాసులు నిర్వహించడంతో మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నారు. ర్యాంకుల పేరుతో విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా కళాశాలలో తనిఖీలు నిర్వహించి చట్ట విరుద్ధంగా నిర్వహిస్తున్న కార్యకలాపాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు, లేనిపక్షంలో బీసీ సంక్షేమ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నామని తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్