కెసిఆర్ నగర్ లో గ్రామసభ వెంటనే ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయం తీసుకొని పన్నులు వసూలు చేయాలి *సిపిఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్

రాజన్న సిరిసిల్ల/తంగళ్ళపల్లి, జూన్ 27 (జాగో న్యూస్): కెసీఆర్ నగర్ గ్రామ సభ ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాతే ఇంటి పన్నులు వసూలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూసం రమేష్ అన్నారు. శనివారం డబల్ బెడ్ రూమ్ కాలనీవాసులతో సమావేశం సెంట్రల్ పార్కులో జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్ మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం కేసీఆర్ నగర్ డబల్ బెడ్ రూమ్ 2025 అక్టోబర్ నెలలో ఎన్నికల ముందు ఇందిరమ్మ కాలనీలో వీలీనం చేయడం జరిగింది. ఇందిరమ్మ కాలనీలో విలీనం జరిగి ఇప్పటికి సంవత్సరం కూడా దాటలేదు. కానీ డబల్ బెడ్రూం ప్రజల వద్ద నుండి ఇందిరమ్మ కాలనీ గ్రామపంచాయతీ అధికారులు నాలుగు సంవత్సరాల ఇంటి పన్ను, నల్ల పన్ను వసూలు చేయడం అన్యాయమని వెంటనే నాలుగు సంవత్సరాల పన్నులు వసూలు చేయడం ఆపాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ కాలనీలో విలీనం అయిన నుండి మాత్రమే పనులు తీసుకోవాలని ముశం రమేష్ గ్రామపంచాయతీ అధికారులను కోరారు. స్కూలు ప్రారంభమైన సందర్భంగా బడి.పిల్లలకు ఫీజులు బట్టలు బుక్కులు కొనడానికి పైసలు లేక తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని, ఇలాంటి సందర్భంలో నాలుగు సంవత్సరాలు ఇంటి పన్ను చెల్లించకుంటే ఆన్లైన్ లో ఇల్లు నమోదు. జరగదని. పుకార్లు సృష్టించి పన్నులు కట్టించుకోవడం చాలా దారుణమైన విషయం అన్నారు. జరుగుతున్న పరిణామాలపై ఈరోజు సమావేశంలో చర్చించి కొన్ని నిర్ణయాలు చేయడం జరిగింది.

1.డబల్ బెడ్ రూమ్ కాలనీ ప్రజలతో సమావేశం. గ్రామపంచాయతీ అధికారులు ఏర్పాటు చేసిన తర్వాతనే పన్నులు చెల్లించాలని

.2. డబుల్ బెడ్ రూమ్ ప్రజల నుండి వసూలు చేసిన పనులు ఎక్కడ ఖర్చు చేస్తారు.

3. డబుల్ బెడ్ రూమ్ లోని మౌలిక సదుపాయాలు పరిష్కారాలు విషయాలు మాట్లాడిన తర్వాత పన్నులు చెల్లించాలని డబల్ బెడ్ రూమ్ ప్రజలు నిర్ణయం చేయడం జరిగింది అని అన్నారు. వెంటనే ఇందిరమ్మ కాలనీ గ్రామపంచాయతీ అధికారులు డబుల్ బెడ్ రూమ్ కాలనీవాసులతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు గోవిందు లక్ష్మణ్. ముశం. శంకర్. రేనా. రుజుమ. లక్ష్మి. సతీష్. గడ్డం రాజేశం తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు