రాజన్న సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట జులై 08 (జాగో న్యూస్): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు రేపాక రామచంద్రన్ ఆధ్వర్యంలో BLA-2ల సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి హాజరై పార్టీ బలోపేతం, బూత్ స్థాయి నిర్మాణం, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమం, BLA-2ల బాధ్యతలు మరియు క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణపై సమగ్రంగా దిశానిర్దేశం చేశారు. ప్రతి బూత్‌లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యకర్తలందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతి రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఉడుగుల యాదగిరి, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు కిరణ్ నాయక్, జిల్లా ఐటీ కన్వీనర్ ప్రకాష్, మండల ప్రధాన కార్యదర్శులు దాసరి గణేష్, కృష్ణహరి, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ పాల్గొన్నారు. అలాగే మండల నాయకులు, శక్తికేంద్ర ఇన్చార్జులు, బూత్ అధ్యక్షులు, BLA-2లు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.








