పదవ తరగతి ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం

హన్మకొండ/ఎల్కతుర్తి,ఏప్రిల్ 30 (జాగో న్యూస్): ఎల్కతుర్తి మండలం, ఇందిరానగర్‌లోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థిని వి. అశ్విత 587 మార్కులతో మండల టాపర్‌గా నిలిచి మొదటి స్థానంలో నిలించింది.. 575 మార్కులతో నబిహా కౌసర్ ద్వితీయ స్థానం, 574 మార్కులతో పి. పూజ తృతీయ స్థానం సాధించారు. అలాగే బి. భావన 572, కే. శివాని 570, ఈ. కౌశిక్ 566, సిహెచ్. విశ్వతేజ 560, ఎమ్. సోనీ 551 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. మండల స్థాయిలో ముందువరుసలో మొత్తం 9 మంది శ్రీ చైతన్య విద్యార్థులు నిలిచారు. మొత్తం 43 మంది విద్యార్థుల్లో 27 మంది 500కు పైగా మార్కులు సాధించగా, పాఠశాల 100 శాతం ఫలితాలను నమోదు చేసింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ బండారి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టాపర్స్‌ను పాఠశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య, ఏజీఎం పద్మాకర్, కోఆర్డినేటర్ తిరుమలరెడ్డి, అకాడమిక్ డీన్ రజనీకాంత్ అభినందించారు. స్వీట్లు పంచి, టపాసులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. అద్భుత ఫలితాల పట్ల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్