తంగళ్లపల్లి, ఏప్రిల్ 30 (జాగో న్యూస్): తంగళ్లపల్లి మండలం నేరేళ్ళ గ్రామంలోని ఇస్కాన్ జగన్నాథ మందిరంలో గురువారం శ్రీ నరసింహ స్వామి జయంతి ఆవిర్భావ దినోత్సవం అత్యంత వైభవంగా జరిగినాయి. సాయంత్రం 3:30 నుండి 4:00 గంటల వరకు హరినామ సంకీర్తనతో వేడుకలు ప్రారంభo అయినాయి. అనంతరం 4:00 నుండి 5:00 గంటల వరకు శ్రీ నరసింహ స్వామి యజ్ఞం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. సాయంత్రం 5:00 నుండి 5:45 వరకు హరికథ హైదరాబాద్ ఇస్కాన్ అత్తాపూర్ ఆలయం ప్రెసిడెంట్ సచినందన్ హరి ప్రభు నరసింహ ఆవిర్బావం అవతరణ హిరణ్యకశిపుని చంపడం భక్తులను కాపాడడం భగవత్గీత గురించి ప్రవచనo చెప్పినారు మరియు మంగళ హారతి కార్యక్రమాలు ముగిసిన అనంతరం సాయంత్రం 6:30 గంటల నుండి భక్తులందరికీ మహా అన్నప్రసాద వితరణ చెసినారు. .సిరిసిల్ల ఇస్కాన్ మేనేజర్ శ్రీ ప్రాణనాథ్ అచ్యుత దాస్, రాధా గోపేశ్వరి దాస్, బలరామ్ ప్రభు మరియు భక్త కన్న ప్రభు తదితరులు పాల్గొన్నారు. నేరేళ్ళ పరిసర ప్రాంతాల భక్తులు, ప్రజలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.









