కరీంనగర్ జూన్ 16 (జాగో న్యూస్): కరీంనగర్ నగరంలోని 54వ డివిజన్ పరిధిలో గల అంగన్వాడీ స్కూల్లో మంగళవారం ‘బడిబాట’ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ప్రభుత్వ బడులలో చేరికలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక డివిజన్ కార్పొరేటర్ జి.ఉమారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐదేళ్ల లోపు పిల్లలకు అంగన్వాడీ కేంద్రాలు ఎంతో మేలు చేస్తాయని, ఇక్కడ అందించే పౌష్టికాహారం, ప్రాథమిక విద్య పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని అన్నారు. అర్హులైన పిల్లలందరినీ తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ వరలక్ష్మి, ఆయా, మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. బడిబాటలో భాగంగా చిన్నారులకు అంగన్వాడీ సిబ్బంది సాదరంగా స్వాగతం పలికారు.









