కరీంనగర్, జూన్ 27 (జాగో న్యూస్): ప్రైవేటు జూనియర్ కళాశాలల ఆఫిలియేషన్ (గుర్తింపు)వెంటనే పూర్తి చేయాలి. విద్యా సంవత్సరం మొదలై 15 రోజులు గడిచిపోతున్న ప్రైవేటు జూనియర్ కళాశాలకు గుర్తింపు రాకపోవడంతో అయోమయంలో విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెంటనే కళాశాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని బిసీ సంక్షేమ సంఘం నాయకులు దొగ్గలి శ్రీధర్, యువజన సంఘం నాయకులు మాదాసు సంజీవ్ తో కలిసి ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారి కి వినతి పత్రం సమర్పించారు.









