కరీంనగర్, జూలై 11 (జాగో న్యూస్): జిల్లా వ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పెంపొందించాల్సిన బాధ్యత వ్యాయామ ఉపాధ్యాయులపై ఉందని జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో శనివారం నిర్వహించిన స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమాన్ని ఆయన వ్యాయామ ఉపాధ్యాయులను పరిచయం చేసుకొని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్పోర్ట్స్ యూనివర్సిటీలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. వ్యాయామ ఉపాధ్యాయుల మరియు కోచ్ ల శిక్షణలోనే విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదుగుతారన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుండి వచ్చిన అతిధి కోచ్ విశాల్ మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడా శిక్షణను అందించే ముందు చేయించవలసిన warm up, అనంతరం చేయాల్సిన కూల్ డౌన్ ఎక్సర్సైజ్ ల గురించి వివరించారు. విద్యార్థుల శారీరక తత్వాన్ని బట్టి వారికి నచ్చే క్రీడాంశాన్ని వ్యాయామ ఉపాధ్యాయులు ఎంపిక చేయాలన్నారు. అలాగే మరో కోచ్ మాట్లాడుతూ పాఠశాలల్లో చిన్నారులకు నిర్వహించవలసిన క్రీడలు తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి వివరించారు. అలాగే చిన్నతనంలో విద్యార్థులు చేసే తప్పిదాలను వివరిస్తూ వాడికి పరిష్కారాలను తెలిపారు. ఫిజియోథెరపిస్ట్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ పాఠశాలల స్థాయిలో విద్యార్థులకు క్రీడల సమయంలో జరిగే వివిధ శారీరక దెబ్బలను తెలిపారు. అలాగే వాటికి పరిష్కార మార్గంగా ఫిజియోథెరపీ ఎలా చేయాలో సూచించారు. అనంతరం క్రీడా పాఠశాల విద్యార్థులతో వివిధ రకాలైన వామప్పులను చేపించి వ్యాయామ ఉపాధ్యాయులకు చూపించారు. ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ కోచ్ రహీం, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఆడపు శ్రీనివాస్ , ఏ శంకరయ్య, జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి బి వేణుగోపాల్,HM శ్రీనివాస్, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు గిన్నె లక్ష్మణ్, వంగపల్లి సూర్య ప్రకాష్, వీరన్న, కట్ట సంతోష్, డి సత్యానంద్, ఆర్ నరసయ్య, పి శ్రీనివాస్ లతోపాటు క్రీడా పాఠశాల కోచ్ లు ఇందిరా, పవన్, శ్రీకాంత్, శ్యాం,చంద్రశేఖర్, వి కిష్టయ్య, విక్రమ్, సంపత్ మరియు జిల్లాలోని 100 మంది వ్యాయామ ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు, ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు.








