అంగన్వాడీ టీచర్ పోస్టులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభం

కరీంనగర్/హుజూరాబాద్, సెప్టెంబర్ 01(జాగో న్యూస్): హుజురాబాద్ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న 16 అంగన్వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మంగళవారం నుండి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభమైందని సిడిపిఓ సుగుణ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతితో పాటు వెరిఫికేషన్ సభ్యుల బృందం పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపట్టిందని పేర్కొన్నారు. మంగళవారం సైదాపూర్ మండలంలోని గొడిశాల-1, గొడిశాల-2, సైదాపూర్-1, సైదాపూర్-2, శాలపల్లి అంగన్వాడీ కేంద్రాల టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ నిర్వహించామని తెలిపారు. హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని కుమ్మరి వాడ, సైదాపూర్ మండలం దుద్దెనపల్లి-1, సర్వాయిపేట అంగన్వాడి అభ్యర్థులకు 2 బుధవారం సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్