రాజన్న సిరిసిల్ల/తంగళ్ళపల్లి, ఫిబ్రవరి 15 (జాగో న్యూస్): అతి పురాతనమైన వరదీశ్వర స్వామి ఆలయ దర్శనానికి భక్తులు వెళ్లేందుకు గ్రామస్తులు దారిని ఏర్పాటు చేస్తున్నారు. తంగళ్ళపల్లి మండలం దేశాయి పల్లె గ్రామంలో అతిపురాతనమైన శ్రీ గుట్ట రాములు (వరదీశ్వర స్వామి) అనే స్వామివారి గుట్ట చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు, రాళ్ళు తొలగించి, గుడిని పునరుద్ధరించాలనే ఉద్దేశం.త్వరలో ఈ స్వామివారికి గండ దీపం వెలిగించాలని గ్రామ పెద్దల నిర్ణయం తీసుకున్నారు. పవిత్రమైన మహాశివరాత్రి సందర్భంగా భాజపా మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు, సర్పంచ్ కంకణాల రజిత రమేష్, గ్రామపంచాయతీ పాలకవర్గం, దేవాలయ కమిటీ మెంబర్, గ్రామ ప్రజలు పిచ్చి మొక్కలను తొలగించడం మొదలుపెట్టారు.









