నేటి సమాజానికి ఆదర్శప్రాయుడు సంత్ సేవాలాల్ మహారాజ్ సర్పంచ్ ఎలుక ఆంజనేయులు

కరీంనగర్/తిమ్మాపూర్, ఫిబ్రవరి 15 (జాగో న్యూస్): నేటి సమాజానికి ఆదర్శప్రాయుడు సంత్ సేవాలాల్ మహారాజ్ అని రేణికుంట సర్పంచ్ ఎలుక ఆంజనేయులఅన్నారు. తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో సర్పంచ్ ఎలుక ఆంజనేయులు ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ కేవలం బంజారా తెగకే కాకుండా, యావత్ సమాజానికి ఆదర్శప్రాయుడు ఆయన బంజారాల సాంప్రదాయాలను, ధర్మాన్ని రక్షించి, జంతు బలులు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడారాని ఆయన చూపిన సత్యం, సేవ, ఐక్యత మార్గంలో నడవడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా గుర్తించి సెలవు దినంగా ప్రకటించడం మనందరికీ గర్వకారణం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్దాంఅనిన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎలుక ఆంజనేయులు మాజీ వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి ఉప సర్పంచ్ ల్యాగల దేవేందర్ రెడ్డి మాజీ ఉపసర్పంచ్ కుంభం శ్రీనివాస్ వార్డు సభ్యులు బోయిని శంకరయ్య కాముని శంకర్,రొండ్ల రాజేశ్వర్ రెడ్డి కాల్వ శ్రీనివాస్ కనపర్తి చంద్రశేఖర్ బస్వారాజు సత్యనారాయణ బొంగాని రమేష్ తమ్మనవేణి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు