కరీంనగర్, ఫిబ్రవరి 15 (జాగో న్యూస్): తెలంగాణ సాయుధ పోరాటయోధుడు ధర్మ బిక్షం ఆశయాల సాధించేందుకు ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త ఉద్యమించాలని న్యాలపట్ట రాజు పిలుపునిచ్చారు. ఆదివారం ధర్మ బిక్షం 104వ జయంతి సందర్భంగా బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఆయన చిత్రపటానికి న్యాలపట్ల రాజుగౌడ్, కసిరెడ్డి సురేందర్ రెడ్డిలు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా న్యాలపట్ల రాజుగౌడ్ మాట్లాడుతూ ఆనాడు నిజాం నవాబుకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచి అనేక పోరాటాలు చేసిన గొప్ప మహనీయుడు అని కొనియాడారు. తెలంగాణ ప్రాంతంలో నిజాం నవాబు జన్మదిన వేడుకలను బహిష్కరించి సంచలనం సృష్టించిన వ్యక్తి అని హైస్కూల్లో చేరి జిల్లాలో వందేమాతరం ఉద్యమానికి నాంది పలికిన మహనీయుడని నిజం పై సాయుధ పోరాటం మొదలైన తర్వాత తుపాకీ చేత పట్టి యుద్ధరంగంలోకి దిగారని ఐదు సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపిన చరిత్ర ఆయనది అని పేర్కొన్నారు. రెండుసార్లు శాసనసభ్యునిగా పార్లమెంటు సభ్యునిగా చట్టసభల్లో తన గొంతు పేదలవైపున వినిపించి అనేక సమస్యల పరిష్కారం కోసం ఆయన కృషి చేశారన్నారు. నల్లగొండ జిల్లాలో తొలి విద్యార్థి నాయకుడిగా 1940 సంవత్సరంలో విద్యార్థి హాస్టల్ నిర్వహించిన తొలి వ్యక్తి అన్నారు. కల్లుగీత కుటుంబంలో జన్మించిన ధర్మ బిక్షం కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారానికి శ్రమించారని దున్నేవానిదే భూమి గీసే వాడిదే చెట్టు అన్న నినాదం ఇచ్చి గీత కార్మికుల హక్కుల కోసం దేశవ్యాప్తంగా అలుపెరుగని పోరాటాలు సాగించిన ఆయన కృషి ఫలితంగానే ఈరోజు ప్రమాదవశాత్తు చెట్టు పై నుండి పడిపోయిన కార్మికులకు ఎక్స్గ్రేషియా అమూల్యకు తీసుకు రావడం జరిగిందని వారు తెలిపారు. ధర్మబిక్షం రగిలించిన పోరాట స్ఫూర్తి నేటి తరానికి దుక్షించుగా నిలుస్తుందని ఇలాంటి గొప్ప నాయకుడి ఆశయాల సాధన ముందుండి పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. జయంతి కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి కల్లు గీతా పనివారాల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పైడిపల్లి రాజుగౌడ్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులుకసిరెడ్డి మణికంఠ రెడ్డికౌన్సిల్ సభ్యులు బోనగిరి మహేందర్, చంద్రశేఖర్ గౌడ్, రాహుల్ అరవింద్, సందీప్, రెడ్డి,వినయ్,ప్రణయ్, తదితరులు పాల్గొన్నారు.









