మానకొండూర్, జూన్ 10 (జాగో న్యూస్): మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బర్త్డే సందర్భంగా ఆయన్ను కలిసి కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఏఎంసి డైరెక్టర్ ఆరేపల్లి బాలు, కాంగ్రెస్ పార్టీ మానవ హక్కుల యువజన విభాగం అధ్యక్షుడు గుగ్గిళ్ళ భరత్ గౌడ్ , మానకొండూర్ నియోజక వర్గ అధికార ప్రతినిధి పసుల వెంకట్ , యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల తిరుపతి , శానకొండ శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.









